NZB: జిల్లా కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 148 ఫిర్యాదులు వచ్చాయి. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన బాధితులు తమ సమస్యలపై కలెక్టర్ ఇలా త్రిపాఠి, అదనపు కలెక్టర్లు కిరణ్ కుమార్, భుజంగరావు, ఇతర జిల్లా అధికారులకు అర్జీలు సమర్పించారు. ప్రజా సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.