ASF: కాగజ్ నగర్ మండలం ఈజ్ గావ్‌లో అక్రమ మద్యం విక్రయిస్తున్న మహిళపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై ఇస్లావత్ నరేశ్ తెలిపారు. ఆదివారం రాత్రి అందిన సమాచారం మేరకు ఓ కిరాణా షాపులో సోదాలు నిర్వహించి, 10 లీటర్ల అక్రమ మద్యాన్ని పట్టుకున్నామన్నారు. నిబంధనలు అతిక్రమించిన షాపు యజమానిపై కేసు నమోదు చేశామన్నారు. అక్రమ కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.