MNCL: బెల్లంపల్లిలో ప్రభుత్వ జూనియర్ కళాశాల (బాలుర) ఇంటర్ పరీక్షలలో అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను మంగళవారం ఘనంగా సన్మానించారు. కళాశాల ప్రిన్సిపాల్ అంజయ్య మాట్లాడుతూ.. కృషి, క్రమశిక్షణ ఉంటే విజయం తప్పక సొంతమవుతుందని తెలిపారు. జిల్లా, రాష్ట్ర స్థాయి మార్కులు సాధించి కళాశాలకు మంచి పేరు ప్రతిష్ఠలు తీసుకువచ్చిన విద్యార్థులను ఆయన అభినందించారు.