PDPL: రామగుండం సీనియర్ జర్నలిస్ట్ జక్కం మారుతి సతీమణి ప్రేమలత ఇటీవల మరణించగా, ఆమె నేత్రాలను సదాశయా ఫౌండేషన్ ద్వారా కుటుంబ సభ్యులు దానం చేశారు. ఈ సందర్భంగా ఎన్టీపీసీ కృష్ణానగర్ మారుతి నివాసంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఫౌండేషన్ వారు కుటుంబ సభ్యులకు అభినందన పత్రాన్ని అందజేశారు. ఇద్దరికీ చూపు ప్రసాదించి ఆదర్శంగా నిలిచారని ప్రశంసించారు.