TG: పదో తరగతి పరీక్షలు ఇవాళ్టి నుంచి ప్రారంభం కానున్నాయి. ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా 2,676 పరీక్షా కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. 5,28,239 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. కాగా, ఏప్రిల్ 16వ తేదీతో ఈ పరీక్షలు పూర్తికానున్నాయి.