AKP: అక్షరాంధ్ర పరీక్షను రేపు అనకాపల్లి మండలంలో 130 కేంద్రాల్లో నిర్వహించడానికి ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఎంపీడీవో ఆశాజ్యోతి తెలిపారు. మొత్తం 3,466 మంది ఈ పరీక్షకు హాజరవుతున్నట్లు పేర్కొన్నారు. పరీక్షల నిర్వహణకు 130 మంది ఇన్విజిలేటర్లను నియమించమన్నారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్ష జరుగుతుందన్నారు.