KRNL: మద్దికేరలోని ఎంపీపీ అనిత యాదవ్ ముస్లింలకు శుక్రవారం ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. సర్వమత సమ్మేళనంలో భాగంగా మతాలకు అతీతంగా ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. మత తారతమ్యాలు లేకుండా అందరూ సోదరాభావంతో మెలగాలన్నారు. ఈ కార్యక్రమంలో డీఎస్ శ్రీనివాసులు, ఖాజావలి, మోదీను, ఎంపీటీసీ అంజి, గంధం చంద్ర, ముస్లింలతో పాటు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.