KDP: బద్వేలులో రెవెన్యూ అధికారులు శుక్రవారం హోటళ్లలో తనిఖీలు నిర్వహించారు. కడప జాయింట్ కలెక్టర్, డిస్ట్రిక్ట్ సప్లై ఆఫీసర్, బద్వేల్ ఆర్డిఓ ఆదేశాల మేరకు ఈ తనిఖీలు జరిగాయి. గోపవరం మండల పరిసర ప్రాంతాల్లోని వివిధ హోటళ్లలో నిబంధనలకు విరుద్ధంగా కమర్షియల్ గ్యాస్ వినియోగిస్తున్నట్లు గుర్తించి, సుమారు 21 గ్యాస్ సిలిండర్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.