VZM: గజపతినగరం కోర్టులో ఇవాళ జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జడ్జి విజయ్ రాజకుమార్ శుక్రవారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కక్షిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. చిన్న తగాదాలను గ్రామస్థాయిలోనే పరిష్కరించుకోవాలని సూచించారు. అదాలత్ సద్వినియోగం చేసుకోవడం ద్వారా సమయాన్ని డబ్బును ఆదా చేసుకోవచ్చన్నారు.