GDWL: సీఎం రేవంత్ రెడ్డి శనివారం జోగులాంబ గద్వాల జిల్లాకు రానున్నారు. గద్వాల పట్టణంలో జరగనున్న ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి తనయుడు సాయి సాకేత్ రెడ్డి, ఐశ్వర్య వివాహ వేడుకకు సీఎం హాజరుకానున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు సీఎం గద్వాలకు చేరుకొని నూతన వధూవరులను ఆశీర్వదించనున్నారని పేర్కొన్నారు.