MDK: పదో తరగతి పరీక్షలు రాసే విద్యార్థులకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించినట్లు మెదక్ డీఈవో విజయ తెలిపారు. బాలురు తమ హాల్ టికెట్ చూపిస్తే చాలు.. రూట్లతో సంబంధం లేకుండా ఉచితంగా ప్రయాణించవచ్చు. బాలికలకు ఆధార్ కార్డు ద్వారా మహాలక్ష్మి పథకం కింద ఉచిత సౌకర్యం ఉంటుందని పేర్కొన్నారు. విద్యార్థులు భయం వీడి, ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాసి విజయం సాధించాలని ఆకాంక్షించారు.