మెదక్ జిల్లాలో డిసెంబర్ వరకు సామాజిక ఆర్థిక సర్వే నిర్వహిస్తున్నట్లు ముఖ్య ప్రణాళిక అధికారి సి. హెచ్. సురేష్ తెలిపారు. శుక్రవారం సీపీఓ కార్యాలయంలో మండల అధికారులకు శిక్షణ ఇచ్చారు. ఈ సర్వే ద్వారా ఉపాధి, నిరుద్యోగిత, పారిశ్రామిక, వాణిజ్య రంగాల ఆర్థిక స్థితిగతుల సమాచారాన్ని సేకరిస్తామని వివరించారు. ప్రజలందరూ సర్వేకు సహకరించి ఖచ్చితమైన వివరాలు అందించాలని కోరారు.