BDK: పేద విద్యార్థులు ప్రైవేట్ కళాశాలల్లో చేరి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొకుండా ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ప్రవేశాలు పొందాలని కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. జిల్లాలోని ప్రతి పదో తరగతి విద్యార్థులు సమీప ప్రభుత్వ జూనియర్ కళాశాలతో అనుసంధానం చేయాలని అధికారులను ఆదేశించారు. అందుబాటులో కోర్సులు, సౌకర్యాల వివరాలతో కరపత్రాలు పంపిణీ చేయాలని సూచించారు.