NLG: నకిరేకల్‌లో మహాత్మా జ్యోతిరావ్ పూలే జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే వేముల వీరేశం పూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సామాజిక సమానత్వం, వర్ణ వివక్ష వ్యతిరేక పోరాటానికి పూలే బాటలు వేశారని, స్త్రీ విద్య కోసం తన సతీమణి సావిత్రిబాయిని ప్రథమ ఉపాధ్యాయురాలిని చేసిన ఘనత ఆయనదేనని కొనియాడారు.