SRPT: నూతనకల్ మండలం అలుగునూరులో జలజీవన్ మిషన్ ఆధ్వర్యంలో ‘జల మహోత్సవం’, రోడ్డు భద్రతపై గ్రామసభ, ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ కాస నరేందర్ యాదవ్ మాట్లాడుతూ.. వేసవి దృష్ట్యా గ్రామ ప్రజలు నీటిని వృథా చేయకుండా పొదుపుగా వాడుకోవాలని కోరారు. ప్రయాణాల్లో రోడ్డు నియమాలను పాటించాలని సూచించారు.