NLG: చిట్యాల మండలం వట్టిమర్తిలో ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న మేరి పద్మ కుటుంబానికి దూదిగామ సైదమ్మ ఫౌండేషన్ అండగా నిలిచింది. ఫౌండేషన్ వ్యవస్థాపకులు దూదిగామ స్వామి, సత్తి శనివారం రూ.10 వేల ఆర్థిక సాయాన్ని అందజేశారు. ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడమే లక్ష్యంగా, భవిష్యత్తులో అనేక ఉచిత సేవలు అందిస్తామని నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో మేడి హరికృష్ణ ఉన్నారు.