BDK: బూర్గంపాడు మండలం మోరంపల్లిబంజర్ గ్రామంలోని వ్యవసాయ మార్కెట్ చెక్ పోస్ట్ వద్ద అక్రమ వసూళ్లు యథేచ్ఛగా సాగుతున్నాయి. మార్కెట్ సెస్ పేరుతో సిబ్బంది వాహనదారులను, రైతులను బెంబేలెత్తిస్తున్నారు. ఈ చెక్ పోస్ట్ మీదుగా మార్కెట్కు ధాన్యం, వ్యవసాయ ఉత్పత్తులను తరలించే వాహనాల నుంచి నిబంధనలకు విరుద్ధంగా నగదు వసూలు చేస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.