MBNR: దేవరకద్ర మున్సిపాలిటీలో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో అధికారికంగా నిర్వహించిన ఇఫ్తార్ విందులో దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి హాజరయ్యారు. ముస్లిం సోదరులకు ముందస్తు రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఇఫ్తార్ విందులు మత సామరస్యానికి ప్రతీకలుగా నిలుస్తాయని పేర్కొన్నారు.