JN: పాలకుర్తి మండల కేంద్రంలో 42 ఏళ్లపాటు పోలీస్ శాఖలో సేవలందించిన పాలకుర్తి ఎస్సై శ్రీ ఎం.లింగారెడ్డి ఈనెల 28న పదవీ విరమణ పొందనున్నారు. ఈ సందర్భంగా శుక్రవారం యువకులు ఆయనకు ఘనంగా వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. సేవాకాలంలో సుమారు 150 రివార్డులు అందుకున్న లింగారెడ్డి బస్స్టాండ్ వద్ద భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి యువకులు పాలాభిషేకం చేశారు.