HNK: ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న సమ్మెకు కాకతీయ యూనివర్సిటీ విద్యార్థి జేఏసీ సంఘీభావం తెలిపింది. కేయూ లో జరిగిన జేఏసీ నేతల సమావేశంలో కేయూ విద్యార్థి జేఏసీ ఛైర్మన్ డీ.తిరుపతి మాట్లాడుతూ.. ప్రభుత్వం కార్మికుల న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం చర్చలు జరిపి సమ్మెను విరమింపచేయాలన్నారు.