JN: అకాల వర్షాలకు తడిసిన ప్రతి గింజను ప్రభుత్వమే మద్దతు ధరతో కొనాలని జనగామ MLA పల్లా రాజేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు. కొనుగోలు కేంద్రాల్లో టార్పాలిన్లు, గన్నీ సంచులు, రవాణా సౌకర్యాలు కల్పించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు. తరుగు పేరిట మిల్లర్ల దోపిడీని అరికట్టాలన్నారు. లారీల కొరత తీర్చి, యుద్ధప్రాతిపదికన ధాన్యం సేకరించాలని కోరారు.