GDWL: అయిజ మండలం ఏక్లాస్పురం గ్రామ పంచాయతీ కార్యదర్శి రంగన్న శుక్రవారం ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయారు. ఇందిరమ్మ ఇళ్ల మంజూరు విషయంలో ఓ లబ్ధిదారుడి నుంచి రూ. 15,000 రూపాయలు లంచం తీసుకుంటుండగా అధికారులు ఆకస్మిక దాడి చేసి పట్టుకున్నారు. బాధితుడి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన ఏసీబీ బృందం, లంచం సొమ్మును స్వాధీనం చేసుకుని అదుపులోకి తీసుకున్నారు.