BDK: వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లలో అనుమతించిన లోడ్‌కు మించి విద్యుత్ వినియోగిస్తున్నారనే ఆరోపణలపై విద్యుత్ శాఖ అధికారులు ఇవాళ అప్రమత్తమయ్యారు. 5 HP అనుమతి ఉన్న కనెక్షన్‌పై 7.5HP మోటార్ వినియోగిస్తున్న నిందితులపై విద్యుత్ శాఖ ఏడీఈ నోటీసు జారీ చేయడానికి సిద్ధమయ్యారు. గ్రామంలోని పలువురు రైతుల ఫిర్యాదుల మేరకు ఈ వ్యవహారం అధికారుల దృష్టికి వెళ్ళింది.