BDK: మణుగూరు పోలీస్ స్టేషన్లో నూతనంగా ఎస్సైగా పదవీ బాధ్యతలు చేపట్టిన షేక్ రౌఫ్ శుక్రవారం పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లును మణుగూరులోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వీధి నిర్వహణ సక్రమంగా నిర్వహించాలని, ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండాలని సూచించారు.