MHBD: పదేళ్లు అధికారాన్ని అనుభవించి రాష్ట్రాన్ని ఆగం చేసిందని బీఆర్ఎస్పై ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు. సీఎల్పీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. అమెరికాలో కూడా ఆ పార్టీ నేత హరీశ్ రావు రాష్ట్ర పరువుతీస్తున్నారని విమర్శించారు. ఫ్యూచర్ సిటీ సీఎం ప్రణాళికల్లో భాగమని తెలిపారు. కల్వకుంట్ల కుటుంబంలో నలుగురు రాజకీయంగా బతికేందుకు 40 లక్షల మంది యువత భవిష్యత్తు ఆగం చేశారన్నారు.