TG: రాష్ట్రంలోని పలు జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఈ నెల 26 వరకు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర వడగాలులు వీస్తాయని తెలిపింది. ఉ.11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎండ తీవ్రత అత్యధికంగా ఉంటుంది అని పేర్కొంది. అత్యవసరమైతే తప్ప ఈ సమయంలో బయటకు రాకపోవడమే మంచిదని సూచించింది. ఎండల కారణంగా ఇప్పటికే 30 మందికి పైగా మృతి చెందినట్లు అధికారులు గుర్తించారు.