GNTR: కుప్పరావు కాలనీ వాటర్ ట్యాంక్ వద్ద పైపులైన్ల మరమ్మతుల వల్ల శనివారం మంగళగిరిలోని పలు ప్రాంతాల్లో తాగునీటి సరఫరా ఉండదని మున్సిపల్ కమిషనర్ అలీం బాషా తెలిపారు. ఎన్సీసీ రోడ్డు, భద్రావతి నగర్, రత్నాల చెరువు, లక్ష్మీనరసింహస్వామి కాలనీ, పాత మంగళగిరి, కొప్పురావు కాలనీ, శ్రీశైల నగర్, భార్గవపేట, హుస్సేన్ కట్ట ప్రాంతాల్లో సరఫరా ఉండదని తెలిపారు.