ATP: గార్లదిన్నెకు చెందిన ఇద్దరు అన్నదమ్ములపై వేధింపుల కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. గార్లదిన్నెకు చెందిన రామాంజనేయులుకు, అనంతపురానికి చెందిన అశ్వినికి 16 ఏళ్ల క్రితం వివాహమైంది. భర్త రామాంజనేయులు తరచూ మద్యం సేవించి భార్యను వేధిస్తుండేవాడు. భర్త, ఆయన సోదరుడు వేధింపులు తాళలేక అశ్విని గార్లదిన్నె పోలీస్ స్టేషన్లో శుక్రవారం ఫిర్యాదు చేశారు.