ASF: జిల్లాలో జల్ జీవన్ మిషన్ ద్వారా ప్రతి ఇంటికి సురక్షిత తాగునీరు అందించేందుకు చర్యలు కొనసాగుతున్నాయని ఆసిఫాబాద్ అదనపు కలెక్టర్ యువరాజ్ మార్మాట్ తెలిపారు. న్యూఢిల్లీలో కేంద్ర జలశక్తి శాఖ ఆధ్వర్యంలో జరిగిన వీడియో కాన్ఫరెన్సుకు ఆయన హాజరయ్యారు. గ్రామాల్లో పారిశుధ్య పనులు, నీటి సరఫరా మెరుగుపరచడం జరుగుతుందని పేర్కొన్నారు.