KDP: పెట్రోల్, డీజిల్ ధరలు 3వ సారీ పెరగడంతో కడప జిల్లా వాహనదారులు అయోమయానికి గురయ్యారు. ఇవాళ ఉదయం నుంచే పెంచిన ధరలు అమల్లోకి వచ్చినట్లు ఫిల్లింగ్ స్టేషన్ నిర్వాహకులు తెలిపారు. పెట్రోల్ రూ. 0.95, డీజిల్ రూ. 0.96, పవర్ పెట్రోల్ రూ. 0.94 మేర ధర పెరిగింది. దీంతో పాటు నిత్యావసర ధరలు పెరుగుతాయని ప్రజలు ఆవేదన చెందుతున్నారు.