NDL: డోన్ పట్టణంలోని కేవీఎస్ పార్క్లో ఇవాళ ఉదయం మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మార్నింగ్ వాక్ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పార్టీ కార్యాలయం ఓ ప్రకటనలో పిలుపునిచ్చింది. ప్రజలతో మమేకం అవుతూ పార్టీ శ్రేణులతో కలిసి బుగ్గన ఉదయపు నడకలో పాల్గొననున్నట్లు వెల్లడించింది.