NRML: జిల్లా కేంద్రంలో ఇళ్ల గణన ప్రక్రియను పకడ్బందీగా పూర్తి చేయాలని కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. మున్సిపల్ కార్యాలయ సమీక్షలో ఆయన మాట్లాడారు. గ్రామాల కంటే పట్టణాల్లో గణనపై మరింత జాగ్రత్త వహించాలన్నారు. సిబ్బంది ప్రజలకు అర్థమయ్యేలా ప్రశ్నలు అడిగి, ఖచ్చితమైన వివరాలను నమోదు చేయాలని స్పష్టం చేశారు.