JGL: ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని కోరుతూ బీజేపీ నాయకులు శుక్రవారం మెట్పల్లి తహశీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. అనంతరం తహశీల్దార్ నీతకు వినతి పత్రం అందజేశారు. తాలు పేరిట కోతలు విధించడం వల్ల రైతులు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు ఇబ్బందులు లేకుండా వెంటనే కొనుగోళ్లు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.