కృష్ణా: గుడివాడ నెహ్రూ చౌక్‌లో పోలీసులు శుక్రవారం రాత్రి ముమ్మర డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. డీఎస్పీ పాల శ్రీనివాసరావు ఆదేశాల మేరకు ఎస్సై కుమార్ రాజా ఆధ్వర్యంలో బ్రీత్ అనలైజర్‌తో పరీక్షలు చేపట్టారు. మద్యం సేవించి వాహనాలు నడిపిన వారిపై కేసులు నమోదు చేసి వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్‌పై కఠిన చర్యలు కొనసాగుతాయని తెలిపారు.