KNR: వీణవంక మండలం పోతిరెడ్డిపల్లిలో శుక్రవారం జరిగిన అగ్నిప్రమాదంలో గీత కార్మికుడు చేపూరి శ్రీకాంత్ గౌడ్‌కు చెందిన తాడిచెట్లు కాలిపోయాయి. పొలంలో ఎవరో వేసిన మంటలు పక్కనే ఉన్న చెట్లకు వ్యాపించడంతో భారీ నష్టం సంభవించింది. కల్లు వృత్తిపైనే ఆధారపడి జీవిస్తున్న శ్రీకాంత్ గౌడ్ చెట్లు దగ్ధమవడం చూసి కన్నీటి పర్యంతమయ్యాడు.