నిర్మల్ జిల్లా గిరిజన అభివృద్ధి కార్యాలయం 2026–27 విద్యాసంవత్సరానికి 3, 5, 8 తరగతుల ప్రవేశాలకు ఏప్రిల్ 22 నుంచి మే 7 వరకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు జిల్లా అధికారి నేటి ప్రకటనలో తెలిపారు. అవసరమైన ధృవపత్రాలతో దరఖాస్తు చేయాలని వారు కోరారు. మొత్తం 24 సీట్లకు మే 14న నిర్మల్ ఆశ్రమ బాలికల పాఠశాలలో లాటరీ ద్వారా ఎంపిక ఉంటుందన్నారు.