MLG: వెంకటాపురం మండలంలోని బస్టాండ్ సెంటర్లో సోమవారం సాయంత్రం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో “ARRIVE AND ALIVE” అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ.. ద్విచక్ర వాహనదారులు తప్పకుండా హెల్మెట్ ధరించాలన్నారు. మద్యం తాగి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పోలీస్ సిబ్బంది, PACS మాజీ ఛైర్మన్ మోహన్ తదితరులు ఉన్నారు.