MNCL: జన్నారం మండలంలోని పోన్కల్ గ్రామంలో నిర్వహించే దిన, వార సంతల వేలంపాట డిపాజిట్ స్వీకరణను స్థానిక ఈవో రాహుల్ ప్రారంభించారు. 2026-27 సంవత్సరానికి వేలంపాటను సోమవారం ఉదయం గ్రామపంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేశారు. పలువురు ముందుకు వచ్చి దిన సంతకు రూ.10 వేలు, వారసంతకు రూ.20 వేలు డిపాజిట్ చెల్లిస్తున్నారు. సాయంత్రానికి వేలంపాట పూర్తవుతుందని తెలిపారు.