ADB: బేలా మండల కేంద్రంలోని శ్రీరామ్ మందిరంలో బీజేపీ ఆధ్వర్యంలో పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆదిలాబాద్ ఎంపీ గొడాం నగేష్ ముఖ్య అతిథిగా హాజరై కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. బూత్ స్థాయిలో పార్టీని బలోపేతం చేయాలని, కేంద్ర ప్రభుత్వ పథకాలను ఇంటింటికీ తీసుకెళ్లాలని ఆయన పిలుపునిచ్చారు.