MNCL: బహుజన చక్రవర్తి సర్ధార్ సర్వాయి పాపన్న వర్ధంతిని మంచిర్యాలలో గురువారం జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలోని రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంకులో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయగా.. పలువురు రక్తదానం చేశారు. ఈ కార్యసమితి జిల్లా అధ్యక్షుడు గుమ్ముల శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.