KMR: జిల్లాలో ఈనెల 6వ తేదీ నుంచి ‘ప్రజాపాలన-ప్రగతి’ పాలన కార్యక్రమం నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా పాఠశాలలు, వసతి గృహాలపై నిరంతర పర్యవేక్షణ చేపట్టి ప్రభుత్వం నిర్దేశించిన 99 రోజుల కార్యాచరణ ప్రణాళికను పకడ్బందీగా అమలు చేయాలని కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ఆదేశించారు. బుధవారం సాయంత్రం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు.