SRCL: ప్రముఖ యాంకర్ సుమ కనకాల బుధవారం వేములవాడ భీమేశ్వర ఆలయాన్ని సందర్శించారు. ఆమె శ్రీ భీమేశ్వర స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. క్షేత్ర సంప్రదాయం ప్రకారం సుమ కోడె మొక్కును సమర్పించుకున్నారు. అనంతరం ఆలయ అర్చకులు ఆమెకు తీర్థ ప్రసాదాలు అందజేసి, వేద మంత్రాలతో ఆశీర్వచనం గావించారు.