MDK: మెదక్ IDOC కార్యాలయంలో మహిళా ఉద్యోగులకు ‘పోష్ చట్టం-2013’, ‘షీ బాక్స్’ పోర్టల్‌పై ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యాలయాల్లో మహిళల రక్షణ, లైంగిక వేధింపుల నివారణే లక్ష్యంగా ఈ కార్యక్రమం జరిగింది. పని ప్రదేశాల్లో ఎలాంటి వేధింపులు ఎదురైనా బాధితులు నిర్భయంగా ఆన్లైన్ ద్వారా షీ బాక్స్ పోర్టల్‌లో ఫిర్యాదు చేయవచ్చని అధికారులు స్పష్టం చేశారు.