MBNR: జడ్చర్ల మున్సిపాలిటీ 3వ వార్డు పరిధిలోని సరస్వతీ నగర్ ఫేస్-2లో ఛైర్పర్సన్ కోనేటి పుష్పలత శుక్రవారం పర్యటించారు. వర్షాకాలంలో వాన నీటితో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని స్థానికులు ఆమె దృష్టికి తెచ్చారు. దీనిపై స్పందించిన సమస్యను ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి, త్వరలోనే కల్వర్టు నిర్మించి శాశ్వత పరిష్కారం చూపుతామని హామీ ఇచ్చారు.