RR: ఇబ్రహీంపట్నం పురపాలక సంఘం ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళలకు ఇందిరమ్మ చీరలను పంపిణీ చేసి వారిని సన్మానించారు. మహిళలు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని, ప్రభుత్వం ఎల్లప్పుడు మహిళల అభివృద్ధికి కట్టుబడి ఉందని ఎమ్మెల్యే తెలిపారు.