MBNR: మహబూబ్నగర్ డీసీసీబీ ప్రధాన కార్యాలయంలో తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టర్, డీసీసీబీ ఛైర్పర్సన్ ఖుష్బూ గుప్తా జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం బ్యాంకు ఖాతాదారుల కోసం యూపీఐ క్యూఆర్ కోడ్ సౌకర్యాన్ని ఆమె ప్రారంభించారు. ఈ సరికొత్త డిజిటల్ సేవల వల్ల బ్యాంకు నగదు లావాదేవీలు వేగవంతం కానున్నాయని అధికారులు తెలిపారు.