MNCL: సహారా ఇండియాలో తాము కట్టిన డిపాజిట్లను వెంటనే చెల్లించాలని బాధితులు డిమాండ్ చేశారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో బుధవారం సహారా బాధితులు సమావేశమయ్యారు. డిపాజిట్ల కాల పరిమితి దాటి పోయి ఏళ్ళు గడుస్తున్నా సహారా యాజమాన్యం డబ్బులు చెల్లించడం లేదని వాపోయారు. డబ్బులు చెల్లించకుంటే తమకు ఆత్మహత్యలే శరణ్యం అని బాధితులు పేర్కొన్నారు.