ADB: ఇటీవల రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాల పాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించిన RI సంతోష్ కుటుంబాన్ని జిల్లా కలెక్టర్ రాజర్షి షా భీంపూర్ మండలంలోని కరంజీ గ్రామంలో గురువారం పరామర్శించారు. కుటుంబ సభ్యులను కలిసి ధైర్యంగా ఉండమని భరోసా కల్పించారు. ప్రభుత్వం తరఫున అన్ని విధాల అండగా ఉంటామని హామీ ఇచ్చారు.