BDK: ఎన్నికల వేళ ఇచ్చిన హామీని బెండలపాడు సర్పంచ్ బొర్రా లలిత నెరవేర్చుకున్నారు. చంద్రుగొండ మండలం బెండలపాడు గ్రామ భక్తాంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి ఆర్థిక సాయం చేస్తానని ఆమె గతంలో మాట ఇచ్చారు. అయితే ఇవాళ రూ. 3 లక్షల నగదును ఆలయ కమిటీ సభ్యులకు అందజేశారు. ఇచ్చిన మాట ప్రకారం ఆలయ నిర్మాణానికి తోడ్పాటు అందించడంపై గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు.