MBNR: భూత్పూర్ మండలం వెల్కిచర్ల గ్రామంలో ద్విచక్ర వాహనాన్ని టిప్పర్ ఢీకొని ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందిన ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. ఎక్సెల్ ద్విచక్ర వాహనంపై వెళ్తున్న జహంగీర్ (40) అనే వ్యక్తిని టిప్పర్ బలంగా ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. మృతుడు బిజినేపల్లి మండలం ఎలుగొండ గ్రామానికి చెందిన వ్యక్తిగా ఎస్సై గుర్తించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.